*బడి*:-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 ఇది మాబడి
చదువులమ్మ గుడి
గురువుల చల్లని ఒడి
చదువుల వెంబడి
నేర్పును చక్కని నడవడి
ఆటలు పాటలు నేర్పే గడి
మెదడుకు మేతను వేసే మడి
ఇచ్చును చక్కని మాటల నుడి
కలిగించును ఎదలో తడి 
ఇది మాబడి !!