నిజమైన హీరో నాన్న:-మహమ్మద్ ఆఫ్రీన, పదవ తరగతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెగ్యాం-మండలం. వెల్గటూర్, జిల్లా. జగిత్యాల

 నేను బుడి బుడి అడుగులు వేస్తే సంతోషించాడు నాన్న
నా తప్పటడుగులు సరిదిద్ది సన్మార్గంలో పెంచింది నాన్న
నేను గెలిస్తే తను గెలిచినంత అనడపడేవాడు నాన్న
అమ్మకు తెలియకుండా ఆడిగినవన్ని కొనిచ్చేవాడు నాన్న
నిత్యం నా వెన్నంటి ఉండి నాకు అండగా నిలిచేది నాన్న
నేను జీవితంలో ఉన్నతంగా నిలబడుటకు తోడ్పడేది నాన్న
తన కష్టాన్ని నాకు తెలియకుండా ఆనందాన్ని పంచింది నాన్న
ఇంత చేసిన నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను నాన్న
వృధ్యాప్యంలో నీకు తోడుగా ఉండడం తప్ప ఇంకెమివ్వగలం నాన్న
నా జీవితానికి మార్గదర్శి, నా నిజమైన హీరోవి నీవే నాన్న