పొగాకు చేసేహాని భయంకరం!
సరదాగా పొగత్రాగుట హానియే
ఒకటి రెండుసార్లతో మొదలై
బానిసలై పోతారు సిగిరెట్ కి!
విలాసమే చివరికి చావుపాశం!
గుట్కా,ఖైనీ,పాన్మసాలా తోనే
గుండెకి బలహీనత వచ్చేస్తుంది
ముక్కపొడి పీల్చడం హానియే !
బీడీకట్టలు మాయం చేస్తూనే
ఊపిరితిత్తులు దెబ్బ తింటాయి
పక్కన ఉన్నవారికీ పొగ హాని !
ప్రకటనల జోరులో నేర్చుకునే
యువత అనారోగ్యం పాలౌను
వెచ్చని పొగ ఆయువుక్షయo !
పొగ మానేసిన కొంతకాలానికే
ఆరోగ్యం మెరుగు పడుతుంది
తేడా తెలుసుకో ప్రాణంనిల్పుకో
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి