స్వామీ...అంబేడ్కరా,
మళ్లీ పుట్టవయ్యా...
పాత రోజులే
తిరిగి
పునరావృతమయ్యేట్లున్నాయ్!
హంగులు..ఆర్భాటలతో
నీ జన్మదినోత్స వ
సంబరాలకు
సిద్ధపడిపోతున్నాం.
నిన్ను గురించి
పూర్తిగా తెలుసుకోకుండానే
తెలిసినట్టు
ఫోజు పెట్టేస్తున్నాం,
నిరాధారంగా
నిన్ను నిందించేవాళ్లకు
సరైన గుణపాఠం
చెప్పలేకపోతున్నాం.
ప్రభూ...
మళ్లీ మా మధ్యకు రావయ్యా
దిక్కులు చూస్తున్న వాళ్లకు
దిశా నిర్ధేశం చేయవయ్య!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి