*శ్రీరామనవమి శుభాకాంక్షలు*: *శ్రీరామచంద్ర మూర్తి*

 *రాముఁడు  ఘోరపాతక వి | రాముఁడు, సద్గుణకల్పవల్లికా*
*రాముఁడు షడ్వికార జయ | రాముఁడు సాధుజనావనవ్రతో*
*ద్ధాముఁడు రాముడే పరమ | దైవము మాకని మీ యడుంగు గెం*
*దామరలే భజించెదను | దాశరథీ కరుణాపయోనిధీ*
*రాముడు - బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అయోధ్యకొలువుకు వచ్చి యాగ రక్షణ కోసం రాముడిని తనతో పంపమని అడిగినప్పుడు, యాగరక్షణ చేసి నప్పుడు మన రాముడు - గురు శిష్య సంబంధాలకు ప్రాణంపోసిన వాడు.* 
*యాగ రక్షణ తరువాత గురువుతో, లక్ష్మణునితో కలసి మిథిలకు వెళ్ళిన రాముణ్ణి, రామా సీతను పెళ్ళాడు అంటే, మా తండ్రిగారి సమ్మతం కావాలి అన్నవాడు - సీతను చేపట్టిన సీతారామయ్య*
*తన తండ్రి దశరధుడు, తన తల్లి కైకేయికి ఇచ్చిన మాటకోసం 14సం. రాలు అరణ్యవాసంచేస్తున్న, తనను ఒప్పించి అయోధ్య కు తీసుకువెళ్ళడానికి వచ్చిన భరతునికి, తనకు ప్రజా పాలన చేయడంలో కావలసిన అనుభవం ప్రకృతితో మమేకమై పొందడానికి తల్లి చేసిన ఆలోచన ఈ అరణ్యవాసం అని భరతునికి సర్దిచెప్పిన రామచంద్రుడు - మూర్తీభవించిన ఆదర్శ మూర్తి.*
*భరతుడు, రాముని గుర్తుగా పాదుకలు ఇస్తే తాను సేవకుడిగా రాముని తరుఫున రాజ్యపాలన సాగిస్తాను అన్నప్పుడు పాదుకలు ఇచ్చి పాలన ఎంత ప్రజా రంజకంగా వుండలో చెప్పినప్పుడు మన రాముడు - ప్రజా రంజక పాలనా దురంధరుడు*
*అరణ్యవాసంలో భాగంగా, పలు ప్రదేశాలు చరించి, దాసరాజు గుహుని కలిసినప్పుడు, రాజు తన సేవకునితో ఎలా ప్రవర్తించాలో ఆచరణలో చూపిన మన రాముడు - ధర్మ పరిరక్షకుడు*
*సీతాన్వేషణలో భాగంగా, హనుమ ప్రోద్బలంతో సుగ్రీవునితో స్నేహంచేసి - వాలిని దండించి, మోక్షము ఇచ్చి - అంగదుని రాజ్యాభిషిక్తుని చేసినప్పుడు, మన రాముడు - సుగ్రీవ rస్నేహంతో స్నేహైక మూర్తి.  "ఈ రామ సుగ్రీవ స్నేహం మధ్యమ స్నేహంగా కూడా చెపుతారు."*
*లంకను జయించాలి అనే లక్ష్యంతో,సముద్రుని వద్దకు వచ్చి, ముకుళిళ హస్తాలతో తనకు దారి ఇవ్వవలసినది అని అడిగినా దారి ఇవ్వని సముద్రుని మీదకు కోదండం ఎత్తినప్పుడు మన రామయ్య - కోదండరామయ్య.*
*మహా భీకర యుద్ధంలో, వీభీషణుని సన్నిహితంతో, రావణబ్రహ్మను దునుమాడిన దనుజవైరి, శరణన్న విభీషణుని రాజును చేసిన కారుణ్య మూర్తి, ఆఖరి క్షణాలలో వున్న రావణుని వద్దకు లక్ష్మణుని పంపి ధర్మం నేర్చుకోమని చెప్పిన మన రాముడు -  సర్వ విధలా ధర్మమే రూపుదాల్చిన ధర్మమూర్తి.*
*సంవత్సర కాలం లంకలో వుండి తన వద్దకు వచ్చిన వైదేహి, ఏ విధమైన తప్పు, పొరపాటు చేయదని తనకు తెలిసినా, రాముడిగా తాను నమ్మినా, పాలకుడిగా వున్న రాజు ధర్మ పాలనలో తన పర భేదాలు చూపకూడదు అని, సీతమ్మను అగ్ని ప్రవేశం చేయమన్నప్పుడు మన రాముడు - సత్య ధర్మ పాలన చేసే ధర్మానువర్తి, రఘువంశకీర్తి, యశోధరుడు, దశరధరాముడు*
*మొత్తంగా మానవ జీవితంలో వచ్చే వివిధ దశలలో మానవుడు ఏవిధంగా నడచుకోవాలి అనే విషయాలను తను ఆచరించి చూపించిన నిలువెత్తు ఆదర్శమూర్తి మన రామచంద్రుడు. రఘువీరుడు.*
---------------------------
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss