"అమ్మయ్య, నా ఫోటో లేదుగా": -- యామిజాల జగదీశ్


 అది రద్దీగా ఓ బస్టాండ్. ఇరుగు పొరుగు ఊళ్ళకు వెళ్ళే పెద్ద బస్టాండ్ అది. ఆ బస్టాండు ప్రవేశ ద్వారంలో ఓ పెద్ద బోర్డు ఉంది. అది పోలీస్ విభాగం వారి ప్రకటన. ఇక్కడ జేబు దొంగలున్నారు. కనుక ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన హెచ్చరిక బోర్డు అది. ఆ ప్రకటనలో ఓ ఇరవై మంది జేబుదొంగల ఫోటోలు పేర్లతోసహా ప్రచురించారు. ఆ బోర్డుని తదేకంగా చూసిన ఒక వ్యక్తి ఈ బోర్డులో తన ఫోటో లేనందుకు అమ్మయ్య బతుకుజీవుడా అనుకున్నాడు. అప్పటికే తన దగ్గరున్న రెండు వేల రూపాయలను సరి చూసుకుని లోపల పెట్టుకున్నాడు. ఇక తన పని కానిచ్చెయ్యాలనుకుని ప్రయాణికులతో రద్దీగా ఉన్న ఓ బస్సెక్కాడు.