ఎండాకాలం -(బాలగేయం)--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
ఎండా కాలం వచ్చిందోయ్ 
ఎల్లరు జాగ్రత్తగుండాలోయ్ 
 ఎందుకు బయట తిరగడం? 
ఇంచక్కా ఇంట్లో ఆడుదాము!

క్యారం బోర్డు, అంత్యాక్షరీ 
డాబా మీద వడియాల్ ఫ్యాక్టరీ 
అమ్మకు సాయం చేద్దాము 
త్వరగా వంట ముగిద్దాము!

పాఠాలు వల్లె వేద్దాము 
హాల్లో అరలను సర్దుదాము 
పనికొచ్చేవి పాత బట్టలు 
తీసి పక్కన పెడుదాము !

బైట అయిస్ లూ కొనరాదు 
రోడ్డు పక్కనవి తినరాదు 
చేతులు శుభ్రం,మూతికి మాస్కు 
చెప్పినమాట తప్పరాదు !