*కవిత్వం వ్రాసుకుంటాడు!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 
1.జనక్షేమం కోరుతూ,
   జగత్కల్యాణం కోసం,
   బీజాక్షరాలు పలికిస్తూ,
   అక్షరబీజాలు మొలకెత్తిస్తూ,
లోకహితం కవిత్వంఅభిమతం,
  అని భావించి, *ఆదికవి*, 
*ఆధునిక కవి*, ఎవరైనా,
కవిత్వం వ్రాసుకుంటాడు!
2.జీవితంలో సౌందర్యం,
                     ఆవిష్కరించి,
   ఆనందం ఆస్వాదించడానికి,
 రచనల్లో నవరసాలు పోషిస్తూ,
  కవిత్వం వ్రాసుకుంటాడు!
3. *వాడి* కలం,
     రెండు వైపులా వాడిఖడ్గం,
     ప్రజలపక్షాన స్వర్గనిర్మాణం,
    కవిత్వం వ్రాసుకుంటాడు!
4.సామాజికకృతఘ్నులపై,
   అక్షరశతఘ్నులు పేల్చడానికి,
   కంకణం కట్టుకున్నవాడు,
   కవిత్వం వ్రాసుకుంటాడు!
5.పాపం! వాడు,
  కవిత్వం వ్రాసుకుంటున్నాడని,
  జాలి పడకు!
వాడు గాలిలో ప్రాణవాయువు,
ఆశలజ్యోతులప్రకాశ ఆయువు
కృషితో ఋషి అవుతాడు!
కవిత్వం వ్రాస్తూ పోతాడు,
వాడు పోయినా!
వాడి అక్షరాలు,చీకటిఆకాశాన,
నక్షత్రాలై మెరుస్తాయి!
తరతరాలుచూసిమురుస్తాయి!
జీవనవిధానాల్ని మారు‌‌స్తాయి!
వాడు  మా *నవ* జీవన,
                     *మార్గదర్శి!*
ద్వంద్వాల జగతిని,
                      *సమదర్శి!*