కరోనా జాగ్రత్తలు(వెన్నెలమ్మ పదాలు):--గద్వాల సోమన్న
కరోనా కడు చిక్కు
స్వీయ రక్షణ దిక్కు
ఊపిరైనా దక్కు
ఓ వెన్నెలమ్మ !

మృత్యు గంటల మ్రోత
పుడమి తల్లికి కోత
జాగ్రత్త అంచేత
ఓ వెన్నెలమ్మ !

మాస్కు ధరించు మేలు
శానిటైజర్ చాలు
లేకున్న గగ్గోలు
ఓ వెన్నెలమ్మ !

చేయు వైరస్ దాడి
కరోనా బహు వాడి
కడుతోందిల పాడి
ఓ వెన్నెలమ్మ !

చిన్న వైరస్ చూడు
చేయుచున్నది కీడు
అయ్యెను వల్లకాడు
ఓ వెన్నెలమ్మ !

వైరస్ గుప్పిట్లో
యమపురి వాకిట్లో
ఏమి జరుగు నెట్లో!
ఓ వెన్నెలమ్మ !


కామెంట్‌లు