విజయోత్సవం:-డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.

 దాయాదుల పీచమణచి
దురాక్రమణలను తిప్పికొట్టి
నియంత్రణరేఖలు దాటిన శత్రుమూకలను చీల్చిచెండాడి
సైన్య వీర శౌర్య పరాక్రమాలు
మిన్నంటిన జాతీయపతాకాలు
ముష్కరుల దుష్టపన్నాగాలను
మట్టికరిపించి నినదించిన‌ భారతసింహాలు
వీరోచితపోరాటాలతో చెలరేగి
భరతమాత రక్షణకు ప్రాణాలు
అర్పించిన అమరువీరుల త్యాగం
సమరంలో శత్రుసైన్యాలను వెనక్కి‌ తరిమి
విజయపతాకం ఎగరవేసినరోజు
జవానుల కదన
విజయోత్సాహం
భారతీయుల సంతోషాల
సంబురం.