మాయాజాలం ::-- లీలా కృష్ణ.-తెనాలి.

ట్రింగ్ ట్రింగ్ ఫోను ..
నిన్నొదిలి ఉండలేము.

 పస్తులకైనా సిద్ధము..
 నీ రీఛార్జి మాకు ముఖ్యము.

 బ్యాలెన్స్ లేని నిన్ను, కలనైన చూడలేము..
 నీవు లేని లోకము..
 మాకు చూపు శూన్యము.

 నిన్ను చూసి హృదయము.. చిగురించును ప్రతి క్షణము.

 నీవే మాకు ఉదయము..
 నీ చేతుల్లో ఉంది  గమ్యము.

 మా కథనాలకు నీవే సాక్ష్యము..
 మా తలరాత నీకంకితము.

 రేడియేషన్ని లెక్కచేయము.. పక్షుల ప్రాణాలతో మేం ఆడతాము చలగాటము.

 చీ పో అన్నా , నిన్ను వదలబోము.. భయమెంత,  చూపినా బుద్ధి మార్చుకోము.

 దోషిగ మిగులుట మాకిష్టము.. మనిషిగ మెదులుట కష్టము.

 ముద్దులొలుకు స్మార్ట్ ఫోను.. చూపించును చుక్కలు , రాను పోను.

 తన చేత చిక్కి చావటము ..
ఎన్నో జన్మల కర్మ ఫలము.