*కవితల పోటీలో జగదీష్ ప్రతిభ*

శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని రాష్ట్రంలోని 6 నుండి 10వ తరగతుల బాలబాలికలకు శ్రీకరం ఫౌండేషన్ నిర్వహించిన కవితా రచన పోటీలో మండలంలోని బొల్లారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి దాసరి జగదీష్ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానం పొందినట్లు తెలుగు భాషోపాధ్యాయుడు అడ్డాడ శ్రీనివాసరావు తెలిపారు.
      ప్రకృతి, సంస్కృతి - సాంప్రదాయాలు, మానవ సంబంధాలు అంశాలుగా ఈ పోటీలు నిర్వహించగా జగదీష్ మానవ సంబంధాలు అంశంగా "మానవ సంబంధాలు - మరుపురాని అనుబంధాలు" అనే శీర్షికతో రచించిన కవిత ప్రథమ బహుమతిని పొందింది. ఈ ఫలితాలను శనివారం సిరిసిల్ల పట్టణంలో శ్రీకరం ఫౌండేషన్ చైర్మన్ కిరణ్ కుమార్ వెల్లడించారు. త్వరలో జగదీష్ కు రూ1516/-ల నగదు బహుమతితో పాటు ప్రతిభా ప్రశంసాపత్రాన్ని అందజేయనున్నారని శ్రీనివాసరావు తెలిపారు.

కామెంట్‌లు