రకరకాల మొక్కలు (బాల గేయం):-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట

చేతిలో చెన్నంగి మొక్క
చక్కగా నాటింది అక్క 
మెల్లగా పెరిగింది మొక్క
చూసి నవ్వింది చుక్క

మంచె కింద మల్లె మొక్క
ముద్దుగా నాటింది అక్క
మంచె పైకి పారింది మొక్క
చూసి నవ్విందా చుక్క

గట్టుకు గన్నేరు మొక్క
గట్టిగ నాటింది అక్క
ఎత్తుగా పెరిగింది మొక్క
చూసి నవ్విందా చుక్క

పెరటిలోన నిమ్మ మొక్క
నిమ్మలంగ నాటింది అక్క
కాయలు కాసిందా మొక్క
నిమ్మరసం చేసింది అక్క

కామెంట్‌లు