చీమ ఒకటి నీటిపైన
కొట్టు మిట్టు లాడుచుండ,
పావురాయి చూసి అంత
ఆకు తెచ్చే ! ప్రాకనిచ్చే !
ఒడ్డు చేర్చే క్షేమముగా !
"మేలు" మరిచిపోక చీమ
పొంచివున్న హాని ఎంచి,
వేటగాని వేలు కరిచి,
పావురాయి ప్రాణాలకు
ముప్పు తప్పునట్లు చేసె !
కాన బాలలారా ! మీరు
ఆపదలో వున్న వారి నెవరినైన,
ఆదుకొనుడు, చేదుకొనుడు.
మనసునిండ హాయి నింపు
" మేలు మనకు మేలు చేయు "
----------------------------------------------------
మిత్రులందరికీ శుభోదయం
సరిగ్గా నేటికీ ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం " ఆంధ్రభూమి " వారపత్రికలో
పిల్లకోసం ప్రత్యేకంగా " బాల భూమి " మినీ పుస్తకం వొచ్చేది అందులో ప్రేత్యేకంగా బ్యాక్ కవర్గా వొచ్చిన నా కవిత + చిత్రం (4 జులై 1993 )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి