శ్రీ శంకరoబాడి సుందరా చారి గారు (జై తెలుగు తల్లీ):-ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

తెలుగులో నొకపాట వెలుగునే ప్రతి నోట 
మా తెలుగు తల్లికీ మల్లెపూ దండగా 

తెలుగమ్మ కడుపులో తేట బంగారమట 
కనులలో నాతల్లి కరుణ చూపించునట 

సిరులతో వెలుగొందు చిరునవ్వు యామెదని 
చిత్రముగ పాడారు చిరయశము పొందారు 

గోదారి గలగలలు గొప్ప కృష్ణానదియు 
బంగారు పంటలను సింగారి నగవులై 

వీరరుద్రమ్మ నూ విజయనగర రాయలు 
మల్లమ్మ పతిభక్తి మన తిమ్మరుసు యుక్తి 

నిత్యముగ నిఖిలముగ నిలిచి యుండే లాగ
జయములే పాడాలి జగమంత మెచ్చాలి 

చక్కగా యీగీతి చాల ఘనమగు రచన 
ప్రతి సభను పాడాలి ప్రతిహృదియు నిండాలి !

సూర్య కుమారి గొంతు సూటిగా పలికినది
విశ్వమంతా తెలుగు విభవమును  పాడినది !