మణిపూసలు: -తోకల నవ్య -తొమ్మిదవ తరగతి ZPHS గుర్రాలగొంది జిల్లా సిద్దిపేట -చరవాణి 9704865816
తల్లిదండ్రులుండాలి
వాళ్ళు పనిని చేయాలి 
ప్రతి రోజు బడికి పంపి 
మమ్ముల చదివించాలి 

చదువు మీద శ్రద్ధ ఉంది 
వంటను చేసుకుంటుంది 
అన్ని పనులు చేసుకుంటు 
చదువు బాగ చదువుతుంది 

తినడానికి తిండి లేదు 
కట్టడానికి బట్ట లేదు
వాన వచ్చి ఇల్లు కూలి
ఉండడానికి ఇల్లు లేదు

చుట్టు పుస్తకాలుఉన్న
ఇటువంటను చేస్తువున్న
చదువు మీద శ్రద్ధ ఉండి 
పనులు చేసి చదువుతున్న 

బాల్య మందు పనులు వద్దు 
చదువుకోవడమేముద్దు
నాలాంటి కష్టమింక
ఏ పిల్లలకు రావద్దు


కామెంట్‌లు