శార్దూలము :
*శ్రీవిద్యుత్కవితాజవంజన మహా | జీమూత పాపాంబుధా*
*రా వేగంబున మన్మనోబ్జ సముదీ | ర్ణత్వంబు గోల్పోయితిన్*
*దేవా! మీ కరుణా శరత్సమయమిం | తేచాలు, చిద్భావనా*
*సేవందామరతంపరై మనియెదన్ | శ్రీకాళహస్తీశ్వరా*
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
పుట్టుట, పెరుగుట, మరణించుట అనే జీవిత చక్రంలో వుంటూ, మహాసముద్రంలో వున్న నీటి బిందువుల లాగా వచ్చే లెక్కలేనన్ని పాపాల నదిలో కొట్టుకుపోతూ, డబ్బు, చదువు, కవితల సంపాదనలో పడి, నా మనస్సులో వున్న తామరపువ్వు తన వికసించడము అనే గుణాన్ని మరచి పోయింది. ఇప్పుడు నాకు, నీ దయ అనే శరత్కాల సమయం కొంచెము దొరికినా, నీకు నా సేవలు చేసి, నీ కరుణను పొంది మరలా నేను నిన్ను చేరుకోగలగుతాను, పార్వతీ వల్లభా!..... అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*మాట్లాడే శక్తి కాని, ఆలోచనా శక్తి కానీ, లేని మూడు జీవాలైన శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు లకు జీవన్ముక్తిని ప్రసాదించి నీ దయా గుణాన్ని, కరుణను చాటుకున్నావు, పార్వతీ నాధా! నీవు ఎంతో దయతో మా మానవులకు, మాట్లాడే శక్తి, ఆలోచనా శక్తి ఇచ్చావు. కానీ, నీవే సృష్టించిన ధనము, చదువు, బంధాలు అనే మాయలో పడి,మా విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయాము. ఇప్పుడు నీవే మాకు దిక్కు, హర హర శంకరా. కరుణించు. కాపాడు.. కాపాలికా!*..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి