తాతయ్య కథలు-18. ;- ఎన్నవెళ్లి రాజమౌళి

 ఎందుకు నాన్నా ఏడుస్తున్నావ్... అని, కొడుకు సాకేత్ ను అడిగింది వాళ్ళ అమ్మ.
నన్ను అందరూ అవిటి వాడు... అవిటి వాడు అంటున్నారు అన్నాడు కొడుకు. అవిటి తనము నీవు పెట్టుకున్నది కాదు రా.. అయినా అది నీ లోపం కూడా కాదు. అని అమ్మ అంటుండగానే... సాకేత్ నాన్న వచ్చాడు.
ఏమి జరిగింది అని అడగగా.. జరిగిన సంగతి చెప్పింది భర్తతో...
కుడి చెయ్యి పని చేయలేనంత మాత్రాన బాధపడవద్దు నాన్న. ఏది జరిగినా మన మంచికే.. అని సామెత ఉంది.
అవున్రా నీవు చిత్రాలు బాగా  వేస్తావు  కదా... అని అమ్మ అనగానే...
దానినే ఛాలెంజ్ గా తీసుకో. బొమ్మలు బాగా వేయి. ఒక రవి వర్మ గానో కాపు రాజయ్య గానోపేరు పొందు. అని నాన్న అనగానే... కళ్లు తుడుచుకుంటూ.. సరే నాన్న అన్నాడు సాకేత్. ఆ మాటతో అమ్మానాన్నలు ఆనందించారు.

కామెంట్‌లు