తాతయ్య కథలు-19._ ఎన్నవెళ్లి రాజమౌళి

  అమ్మా! ఈరోజు  మామిడి కాయ పప్పు, మామిడికాయ చెట్ని చేయవా అన్న అభినందన్ తో...
ఇంట్లో  మామిడి కాయలు లేవురా. మన తోట లోకి వెళ్లి 10 మామిడి కాయలు తీసుకరా అన్నది అమ్మ.
సరేనని, సంచి తీసుకుని తోట కి వెళ్ళాడు.
ఏ చెట్టు ఎక్కాలి అన్నా... ఎక్క రావడం లేదు. ఏమి చేయాలని ఆలోచిస్తుండగా...
చెట్టుపై కోతి కనపడింది. కోతి ని చూడగానే... తను చదివిన కథ గుర్తుకు వచ్చింది. చెట్టు కింద పడుకున్న టోపీ వ్యాపారి టోపీలు అన్ని కోతి ఎత్తుకుపోయి, చెట్టుపై కూర్చుండగా... చేసేదిలేక తన టోపీ తీసి నేలకేసి కొట్టగా... కోతి అది చూసి అన్ని టోపీ లను కిందికి కొట్టింది. ఈ ఆలోచన లాగానే... అభినందన్ రాయిని నేల కేసి కొట్టాడు. ఇది చూసి కోతి కూడా మామిడికాయ తెంపి నేలపైకి విసిరింది.
అలా పది రాళ్ళు అభినందన్ నేలకేసి కొట్టగా... కోతి కూడా 10 మామిడి కాయలు తెంపి నేల పైకి విసిరింది కోతి.
కామెంట్‌లు