తరగతి పుస్తకాలతోపాటు కథల పుస్తకాలు, పెద్దల జీవిత చరిత్రలు చదవాలి అన్న నాన్నతో-
చదువుతూనే ఉంటాను నాన్న అన్నాడు విజ్ఞాన్. కొడుకును శభాష్ అని, ఒకసారి అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఊటికీవెళ్లాడు.
మిలిటరీ హాస్పిటల్ లో ఫీల్డ్ మార్షల్ శ్యామ్ చికిత్స పొందుతున్నారు అనగానే... అతడిని చూడడానికి వెళ్ళాడట. శ్యామ్ బెడ్ ప్రక్కన కూర్చుండి చాలాసేపు ఆయనతో మాట్లాడారు.
తిరిగి వెళ్ళిపోయే సమయం లో... ఇక్కడ ఏమైనా అసౌకర్యంగా ఉందా, ఇంకేమైనా అసంతృప్తిగా ఉందా అని అడిగితే...
ఓ అసంతృప్తి ఉంది సార్. అన్నాడట. ఏమిటది అని రాష్ట్రపతి అడగగానే...
నా దేశ ప్రథమ పౌరుడు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను లేచి సెల్యూట్ చేయలేని స్థితిలో ఉన్నందుకు అని, కళ్ళు తుడుచుకుంటూ ఉండగా
.. అబ్దుల్ కలాం గారి కళ్ళు కూడా తడిచాయి.
కళ్ళు తుడుచుకుని, శ్యామ్-సార్ చిన్న రిక్వెస్ట్ అనగానే-ఏమిటది అని రాష్ట్రపతి అడగగా... తనకు పెన్షన్ రావడంలేదని చెప్పాడట.
ఢిల్లీ కి వెళ్ళగానే ఆ పెన్షన్ మంజూరు చేయించి ఒక కోటి 25 లక్షల చెక్కు పంపగా... ఆ చెక్కును విరాళంగా సైన్యానికి ఇచ్చాడట శ్యాం.
ఈ విషయం చెప్పిన తండ్రి కళ్ళు తడిచాయి. విని కొడుకు కళ్ళు నీళ్లతో నిండాయి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి