సీస పద్యం :
వృక్ష, జంతు, సహజ, భూగర్భ, మతబోధ
లందు చేర్చగ తండ్రి సాహసించె ;
పరిశీలక ప్రకృతి శాస్త్రజ్ఞు డార్వి న్కు,
వంటబట్ట లేదు, వాన్కి చదువు ;
బయలుదేరె ప్రపంచ ప్రకృతి పరిశీల
నాధ్యాయ ' బీగలు ' నౌక యొకటి ,
పెక్కు శాస్త్రజ్ఞు లున్న , నీతని కవకాశ
మొచ్చెను పర్యటిం చుటకు చాల ;
తేటగీతి
దీవుల (15) సమూహమందున తెలిసి కొనిన
పెక్కు విషయాలు రచనలు చేసి , చెప్పె ,
జీవ సృష్టిని దేవుడే చేయ లేదు ,
దేవు డుండిన జీవహిం సేల ననియె ;
బాని సత్వ నిర్మూలనా పాటు పడియె ,
జీవ పరిణామ సిద్ధాంత జీవ మిచ్చె !!
~~~~~~~~~~@~~~~~~~~~
జననం : 27-12-1822#28-09-1895 : మరణం
శ్రీ డార్విన్ మహనీయ # మీకు స్మృత్యంజలి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి