*** శ్రీ వివేకానంద స్వామి ***
సీస పద్యం
భారతావని పుత్రు రామకృష్ణుని శిష్యు ,
ఆయనేను వివేకనంద స్వామి ;
సోదర , సోదరి యు లనగ దీపించె ,
సు ప్రసంగము చికాగొ నున్న ప్రజల ;
వేదాంత విషయాలు సిద్దాంత పరముగా,
బోధ సేయ , విదేశ ములలొ మెచ్చె ;
ధీరయువత కని నిత్యమొక్కటె సూక్తి ,
జీవన గమనము తీరు మార్చు ;
తేటగీతి
జ్ఞాన బోధయ్యె కన్యాకుమారి వద్ద ,
నే డదే వివేకానంద (రాక్) మెట్ట యనగ ,
స్ఫూర్తి నిచ్చె నాతని బోధ లోకు లకును,
జాతి రత్నమే ఆతండు నాడు , నేడు ,
రామ కృష్ణ మఠము స్థాప కాగ్ర గణ్యు !!
~~~~~~~~@~~~~~~~~
జననం : 12-01-1863 # 01-07-1902 మరణం
శ్రీ వివేకానందునికి # స్మృత్యంజలి
స్ఫూర్తి * దీప్తి:-లేఖనం : రామానుజం . జేబులో : 8500630543 .
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి