ఔ మల్ల!:-- బాలవర్ధిరాజు మల్లారం 871 297 1999

మా ఊల్లె ఎనుకట

అరుసలు ఎట్లున్నయంటే

కన్నోళ్ళను

తండ్రిని అయితే

అయ్య /నాయిన/ నాన/బాపు అని

తల్లినయితే..

అవ్వ అని పిలిసెటోల్లు.

తన తోడ బుట్టినోల్లను

పెద్దోల్లనయితే అన్న,అక్క అని,

సిన్నోల్లనయితే తమ్ముడు,సెల్లె అని అనేటోల్లు.

అయ్య అయ్యను తాత అని,

అయ్య అవ్వను  

అమ్మ/నానవ్వ  అని,

అయ్య అన్నను పెద్దయ్య/పెద్ద నాన/ పెద్ద బాపు అని

అయ్య అక్కను  

మ్యానత్త/ పెద్దత్త అని

అయ్య తమ్ముడిని సిన్నయ్య/

సిన్న నాన/ సిన్న బాపు అని

నాన  అక్కను/సెల్లెను  

మ్యానత్త అని పిలిసేటోల్లు.

గట్లనే

అవ్వ అక్కను పెద్దవ్వ అని

అవ్వ సెల్లెను సిన్నవ్వ/సిన్ని అని పిలిసేటోల్లు.

అవ్వ అన్నను/ తమ్మున్ని మ్యాన మామ 

అని అనేటోల్లు.

అవ్వ,

అన్న / తమ్ముని పిల్లలను

మొగొల్లయితే..

మ్యాన బామ్మర్డులని,

ఆడోళ్ళయితే..

మ్యాన మరదల్లు అని 

పిలిసేటోల్లు.

అయ్య తరుపునోళ్ళు ఎక్కువన్నట్టు.

అయ్య అక్క/ సెల్లెల్ల 

పిల్లలను బావ, అదినె అని పిలిసేటోల్లు.

గందుకనే..

అయ్య అక్క/ సెల్లె బిడ్డలను

పెండ్లి సేసుకోక పోదురు.

కానీ.

అవ్వ అన్న/తమ్ముని బిడ్డను

పెండ్లి జేసుకునేటోల్లు.

గిదాన్నే మ్యానరికం అని అనేటోల్లు.

ఇగ

ఊళ్ళో ఉన్న అందరూ ఒకరినొకరు

ఏదో ఒక అరుస పెట్టి  పిలుకుంటరు.అందరూ

కలిసి మెలిసి ఉంటరు

ఊరంతా ఒకటే కుటుంబం లెక్క!

ఔ మల్ల!