గీ ఎండ కాలం ల
ఆనలు కొట్టుడు ఏందో?
పంట చేతికొచ్చేటాల్లకు
ఆనలు వడి లీల్ల పాలు గావట్టే.
రైతు కళ్ళల్లో లీల్లు రావట్టె.
గీ సెడ గొట్టు ఆనలు
పాడు గాను.
గవర్నమెంట్ కు
రైతుకు పెట్టు బడి సదురుతున్నందుకు
వేల వేల శనార్తులు!
రైతు బందు గుడ
ఇత్తున్నందుకు
కోటి కోటి దండాలు!!
గట్లనే
రైతులు తమ పంటను
దాసుకోడానికి గోడౌన్లను
ఇంకా కట్టిత్తే మంచిగుంటది.
అందరి పంటలను
పయిలంగుంటయి .
ఆ పంటలు మన కోసమే!
రైతు బతికేది కూడా
మన కోసమే!
మెతుకుంటేనే
మనకు బతుకు.
గవర్న మెంటోల్లూ
జెర సోచాయించుండ్రి
రైతు ఏడిస్తే
దేశానికి మంచిది కాదు
ఔ మల్ల!
ఔ మల్ల!:-- బాలవర్ధిరాజు మల్లారం. 871 297 1999
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి