ఔ మల్ల!:-- బాలవర్ధిరాజు మల్లారం 871 297 1999

 నా సిన్న తనంల
సావునం  అచ్చిందంటే 
కక్కుడు,ఏర్గుడు పెట్టకుంట,
ఏ రోగాలు రాకుంట
బంగుల లస్మక్క 
ఏదో సెక్కను  రోట్లేసి మెత్తగ దంచి, దాంట్ల  ఇంకేమేమో కలిపి నూరి,  ఆ ముద్దను
ఒక సిన్న కడ ముంతల ఏసి,  ముత్తెమన్ని లీల్లు వోసి బగ్గ కలిపి, ఏరే సిన్న ముంత మీద
పాత బట్ట పేలుక పరిసి,
అడగట్టి 
మందు తయారు సేసేడిది.
గా మందును
ఆమె మనుమలకే కాకుంట
మా ఆడకట్టుల ఉన్న 
సిన్న పోరగాండ్లందరికీ పోసేది.
అందరు మంచిగనే 
తాగేటోల్లు గని
ఒక్క పోరడే తాగనని 
మొత్తు కునేటోడు. 
గా మందు 
ఆసన సూత్తేనే కక్కచ్చేది,
కటికె శేదుండేది
గందుకనే గా పోరడు
మందు తాగనని ఉరికెటోడు
అయిన గని 
ఆల్ల అవ్వ అది కొనిత్త,
ఇది కొనిత్త అని బుదరకిచ్చి 
ఆ పోరనికి తాగిపియ్య వోతే 
మొత్తం ఊంచేటోడు.
ఇగ గిట్లయితే తాగడని
పొయి ఊదే గొట్టాన్ని 
నోట్లె వెట్టి సిన్న గిలాసెడు మందు నోట్లె  వోత్తే..
తూ అని ఊంచేటోడు.
కాళ్ళు రెక్కలు అనుగవట్టి
పొత్తే సిన్న కసికెడన్నే మింగేటోడు. 
గా పోరనికి  
గిసొంటి మందులన్నా,
ఐదుగం మల్లయ్య ఇచ్చే సూదులన్నా,గోలీలన్నా
బగ్గ బయం.
గింతకీ గా పోరడు ఎవడో
సెప్పలేదు గద.
ఆడే ఈడు. ఔ మల్ల!