*అమ్మ మనసు*:-బెజుగాం శ్రీజ-ట్రిపుల్ ఐటీ బాసర-గుర్రాలగొంది జిల్లా సిద్ధిపేట-చరవాణి:8897875575



1ఆ.వె.
మాతృమూర్తి యైన
మన అమ్మ దైవమై
సృష్టి యందు తాను కష్టపడును
కమ్మనైన ప్రేమ ఖర్చులేకుండగ 
చూపుతుంది అమ్మ సుఖము కొరకు
2ఆ.వె.
అమ్మప్రేమచూపు అనురాగమేపంచు
దేవతంతగొప్ప దీవెనిచ్చు
ధనములేనియెడల ధైర్యమునే నింపు
బాధనుతొలగించు భవితపెంచు
3 ఆ.వె.
ఆకసమును మిన్న అమ్మనీ యోర్పును
ప్రేమచూపుపెంచు పేర్మి తోడ
పిల్లలాకు గొప్ప పేరురావాలని
కలలు కనుచు బ్రతుకు కన్నతల్లి

కామెంట్‌లు