నవ్వాలండి నవ్వాలి
ఎప్పుడు నవ్వుతు ఉండాలి
నవ్విన వారికి ఆయుష్షు
తప్పక పెరుగును నిజమండి
పొద్దున లేచిన వెంటనే
వాహ్యాళికి పోవాలి
నోరు తెరిచిబిగ్గరగ
ఆగకుండానవ్వాలి
అందరు హేళన జేసినగాని
పట్టించుకోవద్దండి
మన ఆరోగ్యం మన చేతుల్లో
ఉందని అందరు గుర్తెరగాలి
కష్టాలలో ఉన్నప్పుడు
కన్నీళ్ళు వచ్చును త్వరగాను
వాటిని మర్చిపోవడానికి
ఆయుధం నవ్వేమనకండి
ఎప్పుడు అందరి ముఖాలపైన
చిరునవ్వులే చూడాలి
చిన్నా,పెద్దా,ముసలి,ముతక
అందరు తప్పక నవ్వండి
నవ్వులు నాలుగు విధాల చేటని
అన్నారండిఆనాడు
నవ్వులు నలభై విధాల మేలని
అనుచున్నారు ఈనాడు
ప్రపంచ నవ్వులరోజును
తప్పకమీరు గుర్తుంచుకొని
తోటివారికి చెప్పండి
సత్యమని ఇది నమ్మండి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి