అమ్మ ప్రేమ :- - కయ్యాల దీప్తి జక్కాపూర్, సిద్దిపేట జిల్లా సెల్ :91336 24368

 కనిపించే రెండక్షరాల పదం 
కాని ఆమెనే మన జీవితపథం 
ఆకాశాన వర్షించే మేఘం 
 ఎండమావిలో తీరని దాహం 
చీకటిని పారద్రోలే దీపం 
 భయాన్ని ఎదిరించే ధైర్యం 
ఓటమిని జయించే విజయం 
ఎన్ని జన్మలైన తీరని బంధం 
ఎల్లలులేని ఆమె అనురాగం 
సమస్త సృష్టికి ప్రతిరూపం 
 సృష్టికర్తలు సైతం 
 వెలకట్టలేనిది ఆమె మాతృత్వం .
/-

కామెంట్‌లు