*కార్మిక దినం వర్ధిల్లాలి*:-వరుకోలు మాధవి-గృహిణి, కవయిత్రి-గట్లమల్యాల సిద్ధిపేట జిల్లా-చరవాణి:9441782816
శ్రమదానం చేస్తారు
కార్మికులు నిత్యము 
పని చేయకున్నచో
పస్తులేయుంటాము

మనపాలిట వారును
కల్పతరువు లాగాను
పనులన్నీ చేస్తారు
ప్రతిఫలమాశిస్తారు

ఎఱ్ఱటి  ఎండలోన
చెమట నంత చిందించును
తన రెక్కల కష్టమే
మననోటికి కూడుబెట్టు

ఫ్యాక్టరీలు నడుచును
వారిశ్రమభిక్షవలన
వాహనాలునడుచును
వారి మేథో శక్తివలన 

కార్మిక శక్తిని కొందరు 
దోచుకుంటు ఎదుగుతారు
శ్రమకు తగిన ఫలితము
ఇవ్వడానికిష్టపడరు

ప్రపంచ జనులారా
వారి శ్రమను గుర్తించుడి
కార్మికుల హక్కులను
నిరతముకాపాడండి

కార్మికులను చిన్నచూపు
చూడరాదు ఎప్పుడైనా
ప్రపంచ కార్మిక దినము
వర్ధిల్లాలని కోరుదాము.