వడలిపోతున్న జీవితపు
చెక్కిళ్ళపైన పూసిన
యవ్వనపు రంగు వెలసిపోతుంది.
నిద్రలేని తెల్లని కనుపాప
స్వచ్ఛత మాసిపోతుంది.
మూగబోయిన ఊసులు
మాగన్నులా ముడుచుకుంటే
వేకువ చూసే కోర్కెలు
నల్లని చీకటి రంగును మూసి
తెల్లగా తెలవారుతున్నాయి.
మేఘం దేహం
చెమట బిందువుల తో
చినుకులా జారి
పూరేకు పొదలలో పడి
హరిత వర్ణమైనది
వెలసిన గోడలా అక్కడక్కడా
దిగులు ఊదా రంగు.
తొలిపొద్దు పచ్చని బొట్టు
గోధూళి నీరెండని కలగలిపి
సింధూర వర్ణంగా
అమరింది
ఏ రంగు అయినా బంధించిన
ఎర్రని పెదవులు తెరుచుకున్న వెంటనే
రంగు వెలసిపోయి
తెల్లని పలువరుస పక్కన చేరుతుంది.
హరివిల్లురంగు విరిజల్లుగా మురిసింది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి