గజల్:-సముద్రాల శ్రీదేవి-9949837743
కన్నుయనే చందమామ వెన్నెలనే పూసింది
నీఅందం చూస్తుంటేవన్నెలనే పూసింది

రాత్రిలోన నీఒంటిని చుక్కలన్ని చుట్టుకొని
కొత్తగాను నీపైనే మిన్నులనే పూసింది

సొగసంతా ఒక్కసారి చూడలేని వేళలో
ఒళ్లంతా నిండుగాను కన్నులనే పూసింది

నాదేహం సందేహం వీడనాడి నేడిట్ల
ప్రేమవిత్తుమొలిచిఉన్నమన్నులనే పూసింది

ఆవుపాలలాంటి ప్రేమ అద్బుతాలు పంచగా
గుండెగుడిని చిలుకగానుజున్నులనే పూసింది

అదరమాడు ఆటలోన ఓటమంటు లేకుండ
అందమైన స్పర్శలనేగున్నలనే పూసింది

నిరాశలే ఎదురైతే ఆశలనే బ్రతికించి
ప్రేమలోన ఓడకుండదన్నులనే పూసింది

నీ కొరకే నాప్రేమను నీనడకే నావైపు
నడిపించెడివేళలోనఅన్నులనేపూసింది

శ్రీదేవీ ప్రేమతోడ మాధవుని ప్రేమించి
గుండెలోన అందమైన చిన్నెలనే పూసింది