మన నమ్మకాలు, నిజమైన అవసరాలు.( సమతులన):-రవీంద్ర బాబు కొమ్మూరి. 9959760888
మనకు తెలిసిన వాస్తు..... 
 కిచెన్ ఎక్కడ ఉండాలి?
 బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి?
 బాత్రూమ్ ఎక్కడ ఉండాలి?

మనకు అవసరమైన వాస్తు.....
 సహజ గాలి వస్తుందా?
 సూర్యకిరణాల వెలుతురు అందుతుందా?
 దుర్వాసన వెళ్లే మార్గం ఉందా?

మనం తెలుసుకునే జాతకం.....
 ఉద్యోగం ఎప్పుడు వస్తుంది?
 పెళ్లి ఎప్పుడు అవుతుంది?
 సంపాదన ఎంత వస్తుంది?

మనకు ఉండవలసిన జాతకం.....
 చదువు మీద బుద్ధి పెట్ట గలమా?
 భార్యాభర్తలుగా బాధ్యతగా ఉండ గలమా?
 తృప్తిగా మనశాంతిగా బ్రతక గలమా?

మనకు తెలిసిన సంపూర్ణ ఆరోగ్యం.....
 జిమ్ సెంటర్ కు వెళితే వస్తుందా?
 హాస్పిటల్ కి వెళితే వస్తుందా?
 సంపాదన పెరిగితే వస్తుందా? 

మనకు కావలసిన సంపూర్ణ ఆరోగ్యం.....
రోజువారీ మన పనులు మనం చేసుకోలేమా?
 పోషకాహారాన్ని శరీరానికి అందించ లేమా?
 ఉన్న సంపాదనతో తృప్తిగా ఉండలేమా?

ప్రస్తుత మానవీయ ఆలోచనలతో