నలువది రోజులు ఇంటిలోనే ఉన్నావు
నీ ఇంటిని చక్క దిద్దు కున్నావు
అయినా నీ వెంటే వస్తోందీ కరోనా
నీ ప్రాణం తీసే వరకూ....
ఈ జీవన తరంగాలలో
ఆ దేవుని చదరంగంలో
ఎవరికి ఎవరూ స్వంతమూ
ఎంత వరకీ బంధమూ
చైనాలో పుట్టెను విషం పురుగొక్కటీ
కాటికి నిను పంపే తందుకూ
నీ వెంట పడాలని చూస్తున్నది
నీ తోడు కావాలంటున్నదీ
మనిషికి ఇల్లే స్వర్గ సీమ
భయ పడి నీవెటు పారి పోయినా
మహమ్మారి నీ వెంటబడి
నీ మరణం చూస్తా నంటున్నది
నీ వెంటే వస్తా నంటున్నది
శాసించే మనిషే లేడని
ముప్పు తిప్పలు పెడుతున్నది
నిను ముల్లోకాలుతిప్పుతున్నది
కన్నీళ్లు పెట్టిస్తున్నది
కలకం సృష్టి స్తున్నది
కరోనా వైరస్ మనను వీడకా
చితిలో మంటలు రేపు తున్నది
మనల నెన్నో బాధల గురి చేస్తున్నది
దీనికి విరుగుడు ఒక్కటే
స్వీయ రక్షణలో మనముండడం..."ఈ జీవన..."
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి