శ్రీరంగరాజపురంలో శీనయ్య అనే ఓ పండ్ల వ్యాపారి వుండేవాడు.
అతనికి ఓ పది ఎకరాల పొలం వుంది. అందులో పండిన సపోటా, మామిడి, దోస,
తదితర పండ్లను ఓ ఎడ్లబండిలో తెచ్చి సమీపంలోని సంతలో అమ్మేవాడు.
మొదట తనొక్కడే పండ్లను అమ్ముతుండడంతో బాగా కొనేవారు.
క్రమక్రమంగా ఆ సంతకు పండ్లు తెచ్చి అమ్మే వారి సంఖ్య పది మందికి
పెరిగారు. దీంతో శీనయ్య వ్యాపారం కొంత తగ్గింది. చూస్తున్నంతలో శీనయ్య
వద్దకు పండ్లు కొనడానికి వచ్చే వారు కనుమరుగయ్యారు. ఇది చూసి
శీనయ్య తోటలోనూ చెట్లలో పండ్లు కోయడం మానేశాడు. అవి కుళ్ళిపోసాగాయి.
అతని భార్య ఏదో ఒకటి చేసి పండ్లను సొమ్ముచేసుకుని రావాలని కోరింది.
మరుసటి రోజు శీనయ్య దిగాలుగా సంతకెళ్లాడు. మిగిలిన వ్యాపారుల
వ్యాపారం ఎందుకలా సాగుతొందో గమనించసాగాడు. వాళ్లు కుళ్లిన పండ్లు,
నాణ్యత లేని పండ్లను కూడా ఏదో ఒక ధరకు ఇచ్చి సొమ్ముచేసుకోవడం
చూశాడు.
ఇక తన తోటల్లోని పండ్లను కూడా అలాగే ఎంతో కొంత ధరకు
అమ్మాలని నిర్ణయించుకున్నాడు. తనలా మంచి నాణ్యత కలిగినవే అమ్మితే
నష్టాలు వస్తాయని గమనించాడు.
ఆ మరుసటిరోజు ఓ ముసలాయన శీనయ్య వద్దకు వచ్చాడు. " అయ్యా..
నేను ఓ వృద్ధాశ్రమం నడుపుతున్నాను.. అందులో వున్నవారికి పండ్లు
ఇవ్వాలనుకుంటున్నాను.. ఓ వెయ్యి సపోటా పండ్లు ఇవ్వండి.. ధర ఎంతో
చెప్పండి.. అన్నాడు.."
శీనయ్య బాగా ఆలోచించాడు. " ఏముందిలేవోయ్ ఆ పండ్లు తోటలో
కుళ్లిపోతున్నాయి.. ఊరికే తీసుకెళ్లి వృద్ధులకైనా ఇవ్వు ..
పుణ్యమైనా వస్తుంది.." అన్నాడు.
అయితే వృద్దాశ్రమాధిపతి అదేమి వినకుండా ఓ రెండొందలు చేతిలో పెట్టి
పళ్లు తీసుకెళ్లాడు. అలా ఓ నెల పాటు తీసుకెళ్లాడు. మరుసటి నెలలో ఓ
పండ్ల దుకాణ యజమాని వచ్చి పండ్లు కొన్నాడు. మరో రెండు రోజులకు ఓ
హొటల్ వ్యాపారి వచ్చి దోస కాయలు , అరటి కాయలు తీసుకెళ్లాడు. ఇలా
వ్యాపారం రోజురోజుకూ విస్తరించింది.
ఓ రోజు జ్యూస్ ఫ్యాక్టరీ యజమాని వచ్చి ఓ లారీ మామిడి పండ్లను
కొనుగోలు చేశాడు. తనకు రోజూ సరఫరా చేయాలని కోరాడు. దీంతో శీనయ్య
పండ్ల వ్యాపారం ఇంటివద్దే వేగం పుంజుకొంది. ఒక్క క్షణం కూడా తీరికలేక
వ్యాపారలావాదేవీలలో నిమగ్నమయ్యాడు.
ఓ సాయంత్రం తీరికచేసుకుని సంతలో వ్యాపారులు ఎలా వున్నారో
చూద్దామని వెళ్లాడు. అక్కడ బండ్ల మీద పండ్లు అమ్ముకునేవారివద్ద
కొనడానికి వచ్చేవారే కనిపించలేదు. దైన్య స్థితి చూసి శీనయ్య మనస్సు
చలించింది. తన తోటలోని కొన్ని పండ్లను వారికి ఉచితంగా ఇచ్చి
అమ్ముకోవాలని సూచించాడు. తన వద్దకు వచ్చే కొందరు కొనుగోలు దారులను "
వారుకూడా మనవాళ్లే.. వారి వద్దకూడా కొనండి.." అని చెప్పి వారి
వ్యాపారం కూడా పుంజుకునేలా చేశాడు.
పండ్ల వ్యాపారులు శీనయ్య దయాగుణానికి మెచ్చుకున్నారు. తాము
మొదట్లో సంతలో పండ్ల ధరలు తగ్గించి అమ్మి అతని వ్యాపారాన్ని దెబ్బ
తీసిన సంగతిని తలచుకుని పచ్చాత్తాపపడ్డారు. శీనయ్య వంటి దయాగుణం
కలిగిన వారు ఒక్కరున్నా చాలు.. అందరి కష్టాలు తొలగిపోతాయి .. "
అనుకుంటూ శీనయ్యను పొగ డ్తలతో ముంచెత్తారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి