గొల్లభామ :--కైతికాలు --:--ఎం. వి. ఉమాదేవి
భామకాని గొల్లభామ 
జ్ఞానసుధ చిలుకు భామ 
తనువంత నాట్యం తోను 
తరువు మీది కెక్కు భామ 
వారెవ్వా గొల్ల భామ 
కృష్ణుడేడి అడుగుదామా!

ఏడ నుండి వచ్చిందో 
నీడనివ్వమని కోరుతు 
మందారం పూపొదలో 
సుందరంగ కదలాడుతు 
వారెవ్వా గొల్లభామ 
నీఊసులు చెప్పుభామ !

పరుల సుఖము కేడవరాదు 
ఒకరి బాధకి నవ్వకూ 
తలలో నాలుకగ ఉండు 
తగవులలోన దూరకూ 
వినుడయ్యా జ్ఞానసుధా 
వింతజీవి చేయు బోధ !

పరధన మాశించరాదు 
కరము ఖాళీ గుంచకుము 
శ్రమ చేసి ఫలముపొందుట
సర్వకాల విధి చూడుము 
వినరయ్య జ్ఞానసుధా 
వినోదపు భామకధ !

కృష్ణుడేడి గొల్లభామ
తప్పకుండ తెలుపుభామ 
అన్యాయం జరుగుతుంటె
పలకడేమి అయోరామ 
చెప్పవేమి గొల్లభామ 
చెట్టుమీద నిలిచిపోమ్మా !


ఉన్నాడుగ కలియుగమున 
పడతాడుగ పాపులకధ 
సంఘటనల రూపములో 
విజయసారధి గీతకధ 
గొల్లభామ సాక్ష్యమిచ్చే 
ఉల్లమున శాంతినిలిచె !


కామెంట్‌లు