*మేడే ... గజల్*:- --సోంపాక సీత-భద్రాచలం
*కష్టజీవి భుజంతట్టు ఉద్యమమే మన మేడే !*
*రాజకీయ దోపిడీలు తుంచటమే మనమేడే !!*

*శ్రమజీవులు ఐక్యంగా చిందేసిన తొలిసమరం!*
*పొద్దుపొడుపు రుధిరవర్ణ జ్ఞాపకమే మనమేడే!!*

*చికాగో చిరుస్వప్నం కలలాగా జారనీకు ?!*
*హక్కులకై పెల్లుబికిన నమ్మకమే మనమేడే !!*

*గాయాలే గేయాలై రగులుతున్న స్వేదజలం!*
*పదంకలుపు ఏకతాటి అన్వయమే మనమేడే !!*

*అన్యాయం చెల్లుచెల్లు,గాండీవం చేతబూను !*
*ఓ సీతా' అహంపొల్లు దులపటమే మనమేడే !!*

          

కామెంట్‌లు