నమ్మకమైన కుక్క పిల్ల (బాల గేయం):-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
కుదురుగా ఉండదు కుక్కపిల్ల
ఎదురుగా వచ్చి ఆగింది
కదలకుండా కూర్చుంది
నాలుక చాచి చూస్తుంది

ఇంటికి కాపలా ఉంటుంది
ఎవరైనా ఇంటికి వస్తే
చూపులతో బెదిరిస్తుంది
బౌ బౌ అంటూ అరుస్తుంది

పిడికెడు బువ్వ తింటుంది
పరుగులు తీస్తూ వస్తుంది
ఇంటిలో ఎవరు లేకున్నా
గట్టి కాపలా కాస్తుంది

ఇంటి చుట్టు తిరుగుతూ 
వెనుక కాళ్ళ పై నిలబడి
నాలుగు దిక్కులు చూస్తూ
నమ్మకంగా ఉంటుంది


కామెంట్‌లు