షాడోలు (క్రీనీడలు ) (బాల గేయం ):--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
ఉడుత ఉడుత హూత్ 
జామ పండు మౌత్ 
పుటుకు పుటుకు టీత్ 
బుజ్జిపొట్ట నిండులే ఉమా!

కుచ్చు తోకతో 
 హెచ్చు భయంతో 
మెచ్చు చురుకుతో 
పండును వెతికే తెలివి ఉమా!

కొమ్మ కొమ్మకూ 
గంతు గంతుకూ 
చిట్టి ఉడుతకూ 
పిల్లలు చూడగ తుర్రు ఉమా!

ఇసుక మోసెనోయ్ 
వారధి కేనోయ్
వీపు నిమిరెనోయ్ 
రాముడి  ప్రేమకు చారలుమా!

శుభోదయంతో 
గోడ అంచుతో 
పాకు పరుగుతో 
గింజలు వేసిన తినే ఉమా!

మూగ జీవులే 
అల్ప ప్రాణులే 
దివ్య మిత్రులే 
మనిషికి మోదము ఇచ్చు ఉమా!