బంగారు పక్షి:-ప్రతాప్ కౌటిళ్యా
కండ్ల అఖండ జ్యోతిని వెలిగిస్తూ నే గాలి నాలుగు గదుల హృదయంలో ప్రవహిస్తున్న నదిలా ఎగిరేసిన తెరచాప నావలా కొట్టుకుంటున్న గుండె నడిగితే ఏం చెప్తుంది!

గడ్డకట్టిన నీటిని కరిగించాలంటే నీరు ఆవిరైపోతుంది అన్న నిజం నువ్వు తెలుసుకోవాలి

ఊపిరి ఊదీన బెలూన్ను కాదు భూగోళం గాలిని తీసేస్తే నింపడానికి
అక్కర లేని ఆత్మ పరమాత్మ ప్రాణం తో పాటు పారిపోవడానికి !?

మట్టిని గడ్డ కట్టిస్తే పాత కొత్త పర్వతమై
పోతుంది
రాతిపై మొలకెత్తించే మొక్కల్లా మనుషులు గండు చీమల్లా ఎగబాకాల్సీ వస్తుంది!?

నీరు నెత్తురు పాత స్నేహితులు తెల్లని పావురాళ్ళ భూమిపై ఎగిరే సత్యాలు!?

రంగుల గురించి మాట్లాడకు ఆకాశంలోనే కనిపిస్తే అందవు కానీ అరచేతుల్లో విరబూసిన రంగులు నీ సొంతం!?

రంగుల్ని కళ్ళల్లో వెలిగించాలి కానీ గుండెల్లో వెలిగిస్తే బండరాళ్లు అవుతాయి!?

పెనవేసుకున్న పాదాలకు ముందు వెనుక నడకలు ఉన్నవి ఆ పాదాలు ఎవరివో అని ప్రశ్నిస్తే మనిషి దేవుడై కిందికి దిగి వస్తాడు!?

ఎదిరించడానికి ఎదురుగా ఎవరూ లేరు గాలి తప్ప!?
చూపించడానికి చుట్టూ శూన్యం ఒక్క కాంతి తప్ప!?
దీపం వెలిగిస్తూ నే ఉండు సూర్యుడు ఓడిపోయే దాకా!?

ప్రాణం పోసి ప్రాణం తీసి పంచేంద్రియాలను ప్రయోగశాలలో పరిక్షచేస్తే పంచభూతాలు ప్రత్యక్షమవుతాయి కానీ మనిషి మాయమవుతాడు!?

కన్నీరు నీరు కాదు నీరు నెత్తురు వెలిగిస్తున్న ఏడు ఖండాల అఖండ దీప మే మనిషి!?

బరువులేని గాలినే మళ్ళించ లేని భూగోళం ఇప్పుడు సముద్రాల్నీనదుల్ని శూన్యంలోకి మళ్లించి అంగారకున్నీబంగారు పక్షి గా ఎగరేస్తోంది !?
Dedicated to Beloved late
Srmt Dhanasri garu ,Pune
Pratapkoutilya, lecturer in Bio-Chem

కామెంట్‌లు