తేలనన్నా తేలాలి లేదా మునగనన్నా మునగాలి. (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

        రెండు చేపలు ఉండేవి. 
       వాటిలో ఒకటి తెలివిగలది. 
       రెండూ ఈదుతూ వెళుతున్నాయి.
       ఇంతలో వాటికి ఒక వాన పాము కనిపించింది. 
       అది నీటిలో గిలగిలా కొట్టుకుంటుంది.
       వానపాములంటే చేపలకు భలే ఇష్టం. 
       వానపామును చూడగానే వాటికి నోరూరింది.
       “అబ్బా! ఈ రోజు భలే విందు దొరికింది.
        ఈ వాన పామును పిప్పరమెంట్ బిళ్ళలా చప్పరించాలి" అనుకున్నాయి.
       తెలివిగల చేపకు ఒక సందేహం వచ్చింది. 
       “ఈ వాన పాము నీటిలోకి ఎలా వచ్చింది?
         ఇలా ఎందుకు కొట్టుకొంటుంది?
          నీటిపై తేలనన్నా తేలాలి లేదా మునగనన్నా మునగాలి. 
        మధ్యలో ఎందుకు వేలాడుతుంది?
        ఇందులో ఎదో మోసముంది” అనుకుంది. 
        ఇదే సంగతి రెండో చేపకు చెప్పింది.
       ఆ...బలే చెప్పావులే! మోసం లేదు గీసం లేదు. 
       రుచికర భోజనం ముందుంది. 
        ఒక పట్టుపడదాం పదా!" అని ముందుకు ఉరికింది.
        నోరు తెరచి ఎర్రను అందుకుంది.
        అంతే, వాన పాముకు గుచ్చిన గాలం చేప నోటిని పట్టేసింది.
        చేప లబోదిబోమంటూ గిలగిలా కొట్టుకుంది.
       గాలానికి పడ్డ చేపని తీసి బుట్టలో వేసుకున్నాడు జాలరి.
        “తిండికి ఆతృతపడితే అంతే మరి"  అని అనుకుంటూ పోయింది తెలివిగల చేప.