కళ(సకల సమాహారం)-డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

 అందాలను‌ నయనానందంగా ఆవిష్కరించేది
వీనులవిందుగా శ్రవణానందం కలిగించేది
వర్ణనలతో భావావిష్కరణలను వ్రాయించేది
ఉలితో చెక్కి రాయిని సైతం రమ్యంగా మలిచేది
చక్కని  ‌ఆహార్యంతో ,అద్భుత పదవిన్యాసం చేసేది
నైపుణ్యంతో ఆనందాన్ని ‌కలిగించి అబ్బురపరిచేది
మాటలతో మంత్రం వేసి మంత్రముగ్ధులను చేసేది
జ్ఞాపకశక్తితో గమ్మత్తులు చేసి ఆశ్చర్యపరిచేది
ఏకాగ్రతతో అభిముఖులను చేసుకొని ఆస్వాదింపజేసేది
మేధస్సుతో నూతన ఆవిష్కరణలు జరిపి ధ్వనించేది
ఓజస్సుతో ప్రకాశమానమై వెలుగొందేది
కనికట్టుచేసి,భ్రమలో ముంచి కట్టిపడేసేది
కదిలేది,కదిలించేది,
హృదయాన్ని‌ తాకి అనుభూతికి గురిచేసేది
తన అస్తిత్వంతో ఆలోచింపజేసి
అమరమయ్యేది
తనలో లీనం చేసుకొని మరో లోకానికి తీసుకుపోయేది
బ్రహ్మానందమే పరమావధిగా పనిచేసేది
కడుపునింపి,ఐశ్వర్యాన్ని,
యశస్సులనిచ్చి ఆశీర్వదించేది
అదే కళ........అవే కళలు.......
చతుష్షష్ఠి కళలై లోకాన్ని పాలించేవి.
కామెంట్‌లు