ఊహలు -మణిపూసలు :-- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
ఉజ్వల కెరటము ఊహలు 
భవితకు చూపే దారులు
తమకు తామే నిర్మించు
జీవిత గమ్యపు వెలుగులు !

ఒకఊహ మార్చు బ్రతుకును 
ఆలోచన మది పెరుగును 
వ్యక్తిత్వం తెలుపు ఊహ 
మందికి విలువను తెలుపును !

దగ్గర ఉన్నా తెలియదు 
తత్వం సరిగా నిలువదు 
గందరగోళం హృదయము
కర్మల వాసన విడువదు !

శక్తిని ఊహను కలుపుము 
పట్టుదల నీవు చూపుము 
సంకల్ప దైవముకు మది 
లోమొక్కి పని మొదలిడుము!