కష్టం-నష్టం:-సత్యవాణి
ఎంత కష్టం తెలుగు తల్లికి/
ఎంత నష్టం తెలుగు జాతికి/

అచ్చులల్లులు దిద్దకుంటే/
అమ్మ భాషను నేర్వ కుంటే
ఎంత నష్టం తెలుగు బిడ్డకి
ఎంత దుఃఖం తెలుగు మాతకి/

తెలుగు మాటలు నేర్వకుంటే/
తెలుగు శతకం చదవకుంటే
ఎంత నష్టం తెలుగు బిడ్డకు
ఎంత బాధ తెలుగు తల్లికి/

తెలుగు కథలను చదవకుంటే/
తెలుగు కావ్యాల్ తెలియకుంటే
ఎంత హినుడు తెలుగు వాడు
ఎంత క్షోభో తెలుగు తల్లికి/

తెలుగులై తెలుగున/ మాట్లాడకుంటే
పరుల భాషకు ప్రాకులాడితే
ఎంత ద్రోహియొ తెలుగు వాడు
ఎంత ద్రోహం తెలుగు జాతికి/

ప్రపంచాన ఏ దేశమైనా/
ప్రపంచాన ఏ రాష్ట్రమైనా
విడిచి పెట్టదు మాతృభాషను
పరుల భాషకు ప్రాకులాడదు/

తెలుసుకొనరా తెలుగువాడా/
తెలుగు వద్దను తెగులు విడరా
తల్లి పాలను కుడిచి నీవు
తల్లి రొమ్మును కోయబోకుర/

మాతృ భాషను మరవబోకుర/
మాతృ ద్రోహం చేయబోకుర
చరిత పేజీలలో నీవు
హీనుడల్లె మిగులబోకుర/

కొడిగట్టనీకుర తెలుగు/ దీపము
కోట్లాది జనులకు దారిచూపును
అరచేతుల నడ్డుగ పెట్టరా
అమరదీపమై అది వెలుగొందు గదరా/