నిద్ర లేచావురా?
నిద్రలో భయపడిన
కలను కన్నావా?
ఆంజనేయుని కథలు
తాతయ్య చెబుతారు
శ్రీరామ చరితములు
బామ్మ వినిపిస్తారు
ధైర్య సాహసాలు
మీ నాన్న సొత్తురా
ప్రేమానురాగాలు
మీ అక్క పొత్తురా
పెదవిపై చిరునవ్వు
చెరగ నీయకురా
మా ఎదన నీ నవ్వు
హాయి నింపాలిరా
భయమన్నదే లేక
నీవు ఎదగాలిరా
నిను కన్న వారికీ
పేరు తేవాలిరా
బజ్జోర బజ్జోర
చిన్ని నా కన్నా
నిశ్చింతగా నీవు
నిదురపో చిన్నా
మేమంత ఉండంగ
భయమేలరా నీకు?
ఇసుమంత భయపడక
హాయిగా నిదురపో!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి