గన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్లా.....పేరడీ పాట:-రమేశ్ గోస్కుల-కైతికాల రూపకర్త-హుజురాబాద్.
వచ్చిందే......
 టీకా చూసి అలా పారిపోతే ఎలా.... అట్లా చూస్తున్నారేమిటి ఎవరి మాస్కాళ్ళు కట్టుకోండి రరేయ్...


దైవ మల్లె వచ్చినట్టి కోవిడ్ టీకా! 
వద్దంటు పారిపోయి దాక్కుంటె యెల్లా!
ఏ మారవా!మారవా!మారవా!
మహమ్మారి నిండుగా చుట్టలా చుట్టగా!
జలుబును,దగ్గును,జ్వరం ను మిక్స్ చేసి
రోగమై చేరినావే చిన్న, పెద్ద తేడా మరచి
టీకా వేసుకోని జీవితం 
ఎప్పుడూ నిప్పులల్లో నిండుగా నడవడం  
  టీకా వేసుకోని జీవితం 
కాలకూట మందు  కలయబడి ఈదడం   /దైవమల్లె //
రుచులన్ని తగ్గిపోయిచుట్టు
ముక్కు అంత దిబ్బడేసినట్టు
తనువంత గుల్ల చేయునొట్టు
ఎంత దాడి చేసెనే మనిషి చుట్టూ
వేయి కత్తులతో దాడి లాగా .. విన్నాం లే
బతుకు వేదనతో నిండుమాట...విన్నాం లే

పూట పూట గండమొచ్చినట్టు
యేదేదో జరుగుతుంది .... నీ మీదే ఒట్టే
మారదా!మారదా!మారదా!
నీ భయం లేని బ్రతుకు రీతి మారదా!
ఏ ఆపవా!ఆపవా!ఆపవా!
బ్రేక్ లేని బండి తీరు నడిచే నడకనీ
టీకా వేసుకోని జీవితం
ఎప్పుడూ ముండ్ల లో కుంటుతూ నడవడం
హే టీకా వేసుకోని జీవితం
కత్తులల్లో కళ్ళు మూసుకోని పరుగుతీయడం 
ఒక్క కానరాని వైరసంటు
ప్రపంచ మంత వణుకు తుంది
కనిపించనట్టి శత్రువు పైన
దాడి చేయ టీకా వేసుకో తప్పులేదు

కొన్ని వేల కోట్ల జనం అంతా
మహమ్మారి సోకి ఉన్నరంటా
ఒక్కటీకా వేసుకుంటె చాలు
దాని వేగమాపి రోగబాధ తప్పిపోవు
చెప్పినా! చెప్పినా! చెప్పినా
ఎందరూ మంచి మాట లెన్ని చెప్పినా!
పూసినా!పూసినా!పూసినా!
ఎంతగా శానిటైజర్ పూసిన వీడని శత్రువు 
టీకా వేసుకోని జీవితం
కీడుతోని అంగరంగ వైభవంగ తిరగడం
హేయ్ టీకా వేసుకోని జీవితం
టిప్పు టాప్పు గున్న  భయం తోడ బ్రతకడం



కామెంట్‌లు