హెచ్చరిక దినం ...!!:- -----డా.కె.ఎల్.వి.ప్రసాద్,హన్మ కొండ .

 కష్టానికి సరిపడ 
ఫలితంలభించని 
క్లిష్టమయిన కాలం !
కార్మికులు -కర్శకులు
చమటోడ్చిన శ్రమకు ,
తగినంత న్యాయంఅందని,
దురదృష్టకర  సమయం!
ప్రపంచశ్రామికవర్గం-
ఒకేత్రాటిపై నిలిచి,
విప్లవించి -ఉద్యమించి ,
యాజమాన్యపు -
మెడలువంచి ,
హక్కులు చేజిక్కించుకున్న 
శుభదినానికి సంకేతం 
ఈ' మే-డే'--దినం.!
అందుకే-
కార్మిక-కర్షక మితృలకిది
పండుగ దినం!
హక్కులనునినదిస్తూ 
బాధ్యతలను మరిచేవారికి ,
ఇది సరికొత్త -
హెచ్చరిక దినం ....!!
      

కామెంట్‌లు