చదువంటే దిగులొద్దు (బాల గేయం):-ఎడ్ల లక్ష్మిసిద్దిపేట
బడంటె భయమొద్దు
చదువంటే దిగులొద్దు
ఆడుతూ పాడుతూ
హాయిగా బడికెల్లండి

గురువు బోధన వినరండి
బుద్దిగా మీరు ఉండండి
చదువు పై శ్రద్దపెట్టంండి
సంతోషంగా చదవండి

చదువే మీకు జ్ఞానం
చదువే మీకు బలం
చదువే మీకు భుక్తి
చదువే మీకు శక్తి

చదువు మీకు జీవితం
చదువు మీకు పరిమితం
చదువు మీకు నిర్మితం
చదువు మీకు సంస్కారం