తేడా...!!:-డా .కె.ఎల్.వి.ప్రసాద్,హన్మకొండ .
 ఆశకు అంతుండదు  ,
ఆలోచనకు హద్దుండదు ,
మనసుకు అలుపుండదు ,
డబ్బువిలువ అలాంటిది !
మెదడును ...
చెదలా తినేస్తుంది ....
మనుష్యులమధ్య-
దూరం పెంచేస్తుంది !
ఉన్నవాడికి ఉన్నంత ,
లేనివాడికి --అసలు ,
ఏమీ ఉండదు చింత !!
        ***