*ఇది మాబడి*:-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 మాబడి - ఇది చదువులమ్మ గుడి
ఈ బడిలో - గురువుల అనురాగంతో
పాటలతోనే - పాఠాలు నేర్చాము
ఆటలతోనే - గణితాలు నేర్చాము
నడకలతోనే - విలువలు పొందాము
చేతలతోనే - సంస్కృతి అనుసరించాము
చక్కటి భాషతో - మంచీమమతలు నిండినదీ
విరిసిన పువ్వుల - కాంతులు నిండినదీ
పిల్లతెమ్మెరల - కడలి సవ్వడులు వినిపించేదీ
చిలుక పలుకులతో - అందరికీ ఆనందం పంచేదీ
ఇది మాబడి - చదువులమ్మ గుడి !!
: