*నేను! అవుతా!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.
1.తోటకి చెట్టు!
   నదికి గట్టు!
   గుడికి మెట్టు!
   బడికి జట్టు!
2.తేనెకి పట్టు!
   వానకి బొట్టు!
   కానకి కట్టు!
   పాలకి తెట్టు!
3.కుండకి నీరు!
   కంటికి కన్నీరు!
   వంటికి పన్నీరు!
   నోటికి తేనీరు!
4.చీకట్లో వెలుగు!
   మాటల్లో మెరుగు!
   ఆటల్లో పరుగు!
   వాకిట్లో అరుగు!
5.ఆకాశాన హరివిల్లు!
   అవనిపై విరిజల్లు!
   కరోనాకాలనాగుపడగపై,
        గరుడపాదవేక్సిన్!
  కరోనాపీడితుల,
     గుండెల నిండా ఆక్సిజన్!


కామెంట్‌లు